ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి | Companies Evince Interest to Invest in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో పెట్టుబడులకు పలు సంస్థల ఆసక్తి

Jul 18 2019 10:12 AM | Updated on Jul 18 2019 10:12 AM

Companies Evince Interest to Invest in Andhra Pradesh - Sakshi

మంత్రితో చర్చిస్తున్న కంపెనీల ప్రతినిధులు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి పలు సంస్థలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. బీపీవో సేవలు అందించే ఫస్ట్‌ అమెరికన్‌ ఇండియాతో పాటు, సెల్‌కాన్, కార్బన్‌ మొబైల్స్‌ సంస్థలు, చైనాకు చెందిన పలు కంపెనీల ప్రతినిధులు బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డితో సమావేశమయ్యారు. పెట్టుబడుల ప్రతిపాదనలను మంత్రికి వివరించారు. పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి కల్పనకు ప్రభుత్వం చేస్తోన్న వినూత్న ఆలోచనలు బాగున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఫస్ట్‌ అమెరికన్‌ ఇండియా ప్రతినిధులు పేర్కొన్నారు.

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన సెల్‌కాన్, కార్బన్‌ సంస్థలు తమ వ్యాపార విస్తరణ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. చైనా ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ప్రతినిధులు పెట్టుబడి అవకాశాలపై సమాచార, సాంకేతిక శాఖ ముఖ్య కార్యదర్శి అనూప్‌ సింగ్‌తో చర్చలు జరిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement