చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా సుజల స్రవంతి నుంచి పెద్దచెరువులకు నీరందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ ఎస్సీ శంకర్‌రెడ్డి తెలిపారు.
మదనపల్లె, న్యూస్‌లైన్: చిత్తూరు జిల్లాలో హంద్రీ-నీవా సుజల స్రవంతి నుంచి పెద్దచెరువులకు నీరందించేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని ఇరిగేషన్ ఎస్సీ శంకర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మదనపల్లె రూరల్ మండలం సీటీఎం చెరువు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలో 34 పెద్దచెరువులకు హంద్రీ-నీవా నుంచి నీటిని సరఫరా చేసేలా ప్రతిపాదనలు పంపనున్నారు. జిల్లాలో చెరువుల అనుసంధానానికి సంబంధిం చి రూ.50కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు.
జిల్లాలో మొత్తం 644 చెరువులుండగా ఇటీవల కురిసిన వర్షాలక 155 చెరువులు నిండాయని మదనప ల్లె ఇరిగేషన్ డివిజన్ పరిధి లో 81 చెరువులకు గాను 36 చెరువులు నిండాయన్నారు. త్రిబులార్ కింద జిల్లా వ్యాప్తంగా 50 పనులను ప్రారంభించామని, మిగిలిన ఏడు పనులు నెలరోజుల్లో ప్రారంభించాలని ఆదేశాలు జారీచేసినట్టు తెలిపారు. జిల్లాలోని ఆయకట్టు దారులను ఆదుకునే దిశగా జిల్లా వ్యాప్తంగా 50 చెరవులకు మరమ్మతులకు రూ.10లక్షలలోపు అంచనాలు తయారుచేసి టెండర్లను పిలవనున్నట్లు తెలిపారు.
ఈ టెండర్లను జనవరి నెల నుంచి ఆన్‌లైన్‌లో పిలవడం జరుగుతుందన్నారు. వరదలతో మరమ్మతులకు గురైన పలు చెరువులకు రూ.2 కోట్లతో ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. అదే విధంగా చెరువుల్లో ఇసుక అక్రమ రవాణాపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈఈ నారాయణనాయక్, జేఈ రాజేంద్రప్రసాద్, క్వాలిటీడీఈ మధుసూధన్‌రెడ్డి, కన్‌స్ట్రక్షన్ డీఈ బాలసుబ్రమణ్యం పాల్గొన్నారు.