మా ప్రభుత్వం ఆ విషయం స్పష్టం చేసింది : సీఎం జగన్‌

CM YS Jagan Thanked Ministry Of External Affairs Over Diplomatic Outreach Event - Sakshi

సాక్షి, అమరావతి : ఏ శంకుస్థాపన రాయి కూడా పరిశ్రమగా మెరవకుండా వదిలిపెట్టే ప్రసక్తేలేదని తమ ప్రభుత్వం నిజాయితీగా, చిత్తశుద్ధితో స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఏపీలో పారిశ్రామిక ప్రగతికోసం చేస్తున్న కృషికి సహకరిస్తున్న విదేశీ వ్యవహారాలశాఖకు, డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ సదస్సులో పాల్గొన్న ప్రతిఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.

కాగా పలు కీలక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా శుక్రవారం డిప్లొమాటిక్‌ ఔట్‌రీచ్‌ పేరిట ఓ సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సదస్సులో యూఎస్‌ఏ, యూకే, జపాన్, కెనడా, కొరియా, సింగపూర్, ఆస్ట్రియా, పోలాండ్, ఆస్ట్రేలియా, టర్కీ తదితర 35 దేశాల రాయబారులు, హైకమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరస్పరం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను పెంపొందించుకునే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకోవటమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. (చదవండి: పారదర్శక పాలన మాది.. పెట్టుబడులతో రండి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top