విజయనగరంలో సీఎం పర్యటన ఇలా.. | CM YS Jagan Mohan Reddy Vizianagaram Visit Schedule | Sakshi
Sakshi News home page

విజయనగరంలో సీఎం పర్యటన ఇలా..

Feb 24 2020 3:22 AM | Updated on Feb 24 2020 10:57 AM

CM YS Jagan Mohan Reddy Vizianagaram Visit Schedule - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విజయనగరంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరి 11 గంటలకు విజయనగరంలోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి అయోధ్యా మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ఆయన పరిశీలిస్తారు.

అనంతరం 11.25 గంటలకు ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తరువాత పోలీస్‌ బ్యారక్స్‌ గ్రౌండ్స్‌లో నిర్మించిన దిశ పోలీసు స్టేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు విజయనగరం నుంచి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement