సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనామకుడు కాబట్టే అతన్ని కాంగ్రెస్ హైకమాండ్ పక్కనపెట్టింది అని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
సీఎం అనామకుడు.. అందుకే హైకమాండ్ పక్కన పెట్టింది: శ్రీనివాసయాదవ్
Aug 8 2013 10:55 PM | Updated on Jul 29 2019 5:31 PM
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనామకుడు కాబట్టే అతన్ని కాంగ్రెస్ హైకమాండ్ పక్కనపెట్టింది అని టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన అంశంలో హైకమాండ్ నిర్ణయాన్ని సీఎం కిరణ్ తప్పుపట్టినందున ఆయన ఏపార్టీలో కొనసాగుతున్నారో తెలపాలని తలసాని డిమాండ్ చేశారు. అంతేకాక సీఎం కిరణ్ తాడు, బొంగరం లేనివాడు.. అందుకే అధిష్టానం పట్టించుకోలేదు అని, సీఎంకు ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా తక్షణమే రాజీనామా చేయాలి తలసాని తీవ్రమైన విమర్శలను చేశాడు.
సీడబ్ల్యూసీ తీర్మానాన్ని వ్యతిరేకించకపోవడం ఆయన చేతగానితనానికి నిదర్శనమని,
విభజనతో తలెత్తే సమస్యలను అసెంబ్లీలో చర్చించాలంటున్న సీఎం.. సభను సమావేశపరిచే అధికారం తనకే ఉందన్న సంగతి మరిచారా అని ప్రశ్నించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడ్డ 10 రోజులకు సీఎం స్పందించడం ఆయన అసమర్థతే అని అన్నారు.
Advertisement
Advertisement