నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు | chirajeevi talks like a comedian, says kiran kumar reddy | Sakshi
Sakshi News home page

నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు

Mar 22 2014 10:48 AM | Updated on Jul 29 2019 5:31 PM

నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు - Sakshi

నేను సీఎం ఎప్పుడయ్యానో కూడా చిరంజీవికి తెలియదు

మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ....కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ....కేంద్రమంత్రి చిరంజీవిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిరంజీవి కమెడియన్లా మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తాను సీఎం ఎప్పుడు అయ్యానో కూడా చిరంజీవికి తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు. విభజనకు తానే కారణం అంటుంటే చిరంజీవి రాజకీయ పరిజ్ఞానంపై అనుమానాలు వస్తున్నాయన్నారు. రాజకీయాలు తెలిసిన వారికైతే సమాధానాలు చెప్పవచ్చని కిరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు తానే కారణమని చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఆయన అన్నారు.

తెలుగు జాతి భవిష్యత్ కోసమే తాను పార్టీ పెట్టానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. విభజనపై అవలంభించిన తీరు అవమానకరంగా ఉందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని తాను వ్యతిరేకించానని కిరణ్ పేర్కొన్నారు. విభజనను ఒప్పుకోనని కేంద్రానికి తాను ముందే చెప్పానని, ఎందుకు రాష్ట్రాన్ని విభజించకూడదో వివరణతో కూడిన పత్రాలను కేంద్రానికి పంపినట్లు ఆయన తెలిపారు. అసెంబ్లీలో తిరస్కరించిన బిల్లును పార్లమెంట్లో ఎలా ప్రవేశపెడతారని కిరణ్ ప్రశ్నించారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటామన్నారు. రాష్ట్ర విభజనకు చంద్రబాబు నాయుడు అనుకూలమో, వ్యతిరేకమో ఇప్పటికీ అర్థం కావటం లేదని కిరణ్ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement