25 నుంచి విమానాల రాకపోకల షెడ్యూల్‌లో మార్పు | Change in flight schedule from 25th | Sakshi
Sakshi News home page

25 నుంచి విమానాల రాకపోకల షెడ్యూల్‌లో మార్పు

Mar 18 2018 7:24 AM | Updated on Oct 2 2018 8:04 PM

Change in flight schedule from 25th - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన రాకపోకలకు సంబంధించి మార్చి 25 నుంచి షెడ్యూల్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. అందుకు సంబంధించి ఎయిర్‌పోర్టుతోపాటు ట్రూజెట్‌ సంస్థకు సంబంధించి సమాచారం అందింది. ప్రస్తుతం నడిచే వేళల్లో కూడా కొద్దిపాటి మార్పులు చోటుచేసుకున్నాయి. ఇదే విమానం చెన్నై మీదుగా తమిళనాడులోని సేలంకు కూడా వెళుతుంది.

దీనికి సంబంధించి సేలం వెళ్లే ప్రయాణీకులు కడప ఎయిర్‌పోర్టులో టిక్కెట్టుతోపాటు సమయం వివరాలు తెలుసుకునే వెసలుబాటు కల్పించారు. అందుకు సంబంధించి మార్చి 25 నుంచి విమాన రాకపోకల వివరాలు, సమయం ఇలా ఉండబోతోంది.

విజయవాడలో విమానం బయలుదేరే సమయం    ఉదయం 8.05
కడపకు చేరుకునే సమయం    ఉదయం 9.05
కడప నుంచి విజయవాడ బయలుదేరే సమయం    ఉ.. 9.25
విజయవాడకు చేరుకునే సమయం    ఉ.. 10.30
చెన్నై నుంచి కడపకు విమానం బయలుదేరు సమయం    మధ్యాహ్నం 12.30
కడపకు చేరుకునే సమయం    మ.. 1.30
కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం    మ.. 1.55
హైదరాబాదుకు చేరుకునే సమయం    మ.. 3.00
హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం    మ..3.30
కడపకు చేరుకునే సమయం    సాయంత్రం 4.35
కడప నుంచి చెన్నైకి బయలుదేరు సమయం    సా.. 4.55
చెన్నైకి చేరుకునే సమయం    సా.. 5.55 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement