చంద్రన్న విలేజ్‌ మాల్‌ ప్రారంభం | Chandranna Village Mall was Started | Sakshi
Sakshi News home page

చంద్రన్న విలేజ్‌ మాల్‌ ప్రారంభం

Dec 13 2017 1:29 AM | Updated on Aug 14 2018 11:26 AM

Chandranna Village Mall was Started - Sakshi

సాక్షి, అమరావతి: పేదలకు అన్ని రకాల సరుకులు తక్కువ ధరకే అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు వెల్ల డించారు. ఇందులో భాగంగానే చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ, గుంటూరులో పైలెట్‌ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన ‘చంద్రన్న విలేజ్‌ మాల్‌’ను మంగళవారం సచివాలయం నుంచి సీఎం ప్రారంభించారు. రాష్ట్రంలోని రేషన్‌ షాపులను చంద్రన్న విలేజ్‌ మాల్స్‌గా మారుస్తున్నట్లు తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులు ఎంఆర్‌పీ కంటే 4 శాతం నుంచి 35 శాతం తక్కువ ధరకు లభిస్తాయని వెల్లడించారు.

వచ్చే ఏడాది జనవరి రెండో తేదీ నుంచి పది రోజుల పాటు ‘జన్మభూమి–మాఊరు’ కార్య క్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. పది రోజులపాటు పది అంశాలపై ఈ కార్యక్రమం జరపాలని, ఆయా అంశాల్లో రాష్ట్రం, మండలం, ఆ గ్రామం ఎక్కడ ఉందో చర్చ జరగాలన్నారు. రాష్ట్రంలో పెన్షన్లు, రేషన్‌ కార్డులు కొత్తగా ఎంతమందికి అందివ్వాలన్నది త్వరలోనే నిర్ణ యిస్తామన్నారు. కలెక్టర్ల సదస్సుకు సన్నాహకంగా మంగళవారం సచి వాలయంలో మంత్రులు, కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధిపతులతో సీఎం సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు ఈ భేటీలో పాల్గొన్నారు. 

అందుబాటులో ‘పోలవరం’సమాచారం 
నిర్ణీత వ్యవధిలోగా పోలవరం ప్రాజెక్టు పనులను శరవేగంగా పూర్తిచేసి, 2019 నాటికి రాష్ట్ర ప్రజలకు కానుకగా ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ ప్రాజెక్టు పనులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాలన్నారు. వెంటనే సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం సీఎస్‌కు సూచించారు. విజయవాడ శివారులో చేపట్టిన ఎకనామిక్‌ సిటీ నిర్మాణాన్ని, ప్రస్తుతం సేకరించిన 235 ఎకరాల్లోనే చేపట్టాలని బాబు ఆదేశించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement