చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి | chandrababu will resign: sridevi demand | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి

Feb 16 2015 12:31 PM | Updated on Mar 18 2019 9:02 PM

చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి - Sakshi

చంద్రబాబు రాజీనామా చేయాలి: శ్రీదేవి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి డిమాండ్ చేశారు.

తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయిన శ్రీదేవి డిమాండ్ చేశారు. సుగుణమ్మను ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలని ఆమె సూచించారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ చేతిలో పరాజయం పొందిన కాంగ్రెస్ అభ్యర్థి శ్రీదేవి.. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది.

మరోవైపు ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ మాట్లాడుతూ.. గత సంప్రదాయాలను పాటిస్తూ ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ సీపీ పోటీ చేయలేదని, కాంగ్రెస్ దురుద్దేశ పూర్వకంగానే పోటీ చేసిందన్నారు. తన గెలుపు ప్రజల విజయంగా సుగుణమ్మ అభివర్ణించారు. ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. అఖండ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement