రుణాల మాఫీపై కేంద్రం సహకరించలేదు | chandrababu tour in vijayanagaram distirict | Sakshi
Sakshi News home page

రుణాల మాఫీపై కేంద్రం సహకరించలేదు

Feb 11 2015 5:18 PM | Updated on Jul 28 2018 3:23 PM

రుణాల మాఫీపై కేంద్రం సహకరించలేదు - Sakshi

రుణాల మాఫీపై కేంద్రం సహకరించలేదు

రైతుల రుణాల మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

విజయనగరం: రైతుల రుణాల మాఫీ విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళలకు త్వరలోనే వడ్డీ లేని రుణాలను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్వచ్ఛఆంధ్రప్రదేశ్ పైలాన్‌ను చంద్రబాబు బుధవారం ఆవిష్కరించారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... విజయనగరం జిల్లాకు పలు వరాలు కురిపించారు. చీపురుపల్లిలో ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల, గరివిడిలో పశువైద్య కళాశాల, పార్వతీపురంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. భోగాపురం సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.
(చీపురుపల్లి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement