'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు' | Sakshi
Sakshi News home page

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు'

Published Mon, Sep 15 2014 1:38 PM

'వందరోజుల పాలనలో 101 అబద్ధాలు' - Sakshi

హైదరాబాద్: రుణమాఫీ పేరుతో రైతులకు సీఎం చంద్రబాబు టోపి పెట్టారని ఆంధ్రప్రదేశ్ పీపీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. చంద్రబాబు వంద రోజుల పాలనపై పీసీసీ తయారుచేసిన వాస్తవపత్రాన్ని సోమవారం ఆయన విడుదల చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబు వందరోజుల పాలనలో 101 అబద్ధాలు ఆడారని ఆరోపించారు. వందరోజుల్లో సిమెంట్ ధర రూ.100 పెంచారని గుర్తు చేశారు. మంత్రివర్గంలో పెట్టుబడిదారలకే చోటు కల్పించారని అన్నారు. మంత్రివర్గ సమావేశాలను దిగజార్చారని రఘువీరా దుయ్యబట్టారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement