చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందే

Chandrababu Naidu Should Apologize to Marshalls - Sakshi

సాక్షి, అమరావతి: మార్షల్స్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని మంత్రి కన్నబాబు డిమాండ్‌ చేశారు. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మాట్లాడితే కుదరని.. సభా సంప్రదాయాలు అందరూ గౌరవించాల్సిందేనని స్పష్టం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద‍్రబాబు ఎంత దారుణంగా ప్రవర్తించడం సరికాదని తప్పుబట్టారు. సాధారణ ఉద్యోగులపై అనుచిత భాష వాడారని, ఉద్యోగుల పట్ల ఎంత చులకన భావంతో ఉందో దీన్ని బట్టి అర్థమవుతోందని పేర్కొన్నారు. తన కేటాయించిన గేటులోంచి కాకుండా మరో గేటులోంచి ఎందుకు రావాల్సి వచ్చిందని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. మార్షల్‌ అడ్డుకుంటే ఉదయం 9.15 గంటలకు సభలోకి ఎలా రాగలిగారు అని నిలదీశారు.

తండ్రితో పాటు నారా లోక్‌శ్‌ కూడా మార్షల్స్‌పై నోరు పారేసుకోవడం దారుణమన్నారు. కుమారుడికి అదేనా నేర్పించేది అని కన్నబాబు ప్రశ్నించారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని, దీనిపై స్పీకర్‌ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. నిరాశ, నిస్పృశతో చంద్రబాబు నోటికి వచ్చినట్టు మాట్లాడటం ఏమాత్రం గౌరవప్రదం కాదన్నారు. ఉద్యోగులను పట్టుకుని ఎంత తప్పుడు మాటలు మాట్లాడతారా? అంటూ నిలదీశారు.

చంద్రబాబుపై చర్య తీసుకోవాల్సిందే
మార్షల్స్‌ను బాస్టర్డ్‌ అని దూషించిన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తప్పనిసరిగా చర్య తీసుకోవాల్సిందేనని ఎమ్మెల్యే జోగి రమేశ్‌ డిమాండ్‌ చేశారు. మానసిక రోగి ప్రవర్తించినట్టుగా చంద్రబాబు తీరు ఉందని ధ్వజమెత్తారు. 40 ఏళ్ల అనుభవం, 70 ఏళ్ల వయసున్న చంద్రబాబు.. మార్షల్స్‌ను బాస్టర్డ్‌ అనడం దారుణమన్నారు. మార్షల్స్‌ ఏమైనా తీవ్రవాదులా, పాకిస్తాన్‌లో పుట్టి ఇక్కడికి వచ్చారా? అంటూ ప్రశ్నించారు. అనుక్షణం భద్రత కల్పించే మార్షల్స్‌ను గొంతు పట్టుకుని పీక పిసికేసేలా దురుసుగా ప్రవర్తిస్తారా అంటూ దుయ్యబట్టారు. నిండు సభలో చంద్రబాబు తప్పకుండా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు..

నీ సంగతి తేలుస్తా..

ప్రతిపక్ష నేత వ్యవహరించాల్సిన తీరు ఇదేనా?

టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలి: పేర్ని నాని

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top