'బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు' | chandrababu naidu review meeting with officials | Sakshi
Sakshi News home page

'బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు'

Oct 25 2016 6:37 PM | Updated on Sep 27 2018 4:42 PM

'బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు' - Sakshi

'బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు'

బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు విధానం అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

విజయవాడ: ఆదాయ వనరుల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లా విజయవాడలో సమీక్షించారు. ఈ ఏడాది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో 12 శాతం వృద్ధిరేటు ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. సీఆర్డీఏ నిబంధనల కారణంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తక్కువ ఆదాయముందని సీఎంకు తెలిపారు.

రాష్ట్రంలోని బార్లు, వైన్స్ షాపుల్లో ప్రతి లావాదేవికి బిల్లు ఇచ్చే విధానం అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆరు శాఖల్లో 13.5 శాతం వృద్ధి కన్పించిందని ఆర్థికశాఖ అధికారులు వివరించగా, శాఖల పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆర్థికశాఖ శాస్త్రీయ పద్ధతిలో విశ్లేషించాలని చంద్రబాబు వారికి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement