వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానం | chandrababu invites ys jagan mohan reddy for his oath | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానం

Jun 6 2014 5:23 PM | Updated on Jul 28 2018 3:15 PM

వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానం - Sakshi

వైఎస్ జగన్ కు చంద్రబాబు ఆహ్వానం

తన ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు.

హైదరాబాద్: తన ప్రమాణ స్వీకారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. వైఎస్ జగన్ కు ఫోన్ చేసి ఈ మేరకు ఆహ్వనం పలికారు. ఎల్లుండి తాను ప్రమాణ స్వీకారం చేస్తున్నానని, ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు. చంద్రబాబుకు ఫోన్లో జగన్ అభినందనలు తెలిపారు. జగన్ ప్రస్తుతం రాజమండ్రిలో ఉన్నారు. పార్టీ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ నెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఆర్భాటంగా ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాణ స్వీకారం రాత్రివేళ జరగనున్న నేపథ్యంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను సభాప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement