ప్రజలను మోసగించేందుకు చంద్రబాబు కుట్రలు

Chandrababu Cheated AP People : YSRCP Udaya Bhanu - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉదయభాను

వత్సవాయి(జగ్గయ్యపేట): నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంతో అధికారం పంచుకొని ఇప్పుడు ప్రత్యేక హోదా, కడప ఉక్కు, రైల్వే జోన్‌ అంటూ దొంగ దీక్షలతో ప్రజలను మోసం చేయాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను విమర్శించారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం వత్సవాయిలో సంఘీభావ పాదయాత్ర ప్రారంభించారు. 

గ్రామంలోని ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన సభలో ఉదయభాను మాట్లాడుతూ బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విదేశాల చుట్టూ తిరుగుతున్నా రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాకపోగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి మాటెత్తని బాబు ఎన్నికలు సమీపిస్తుండటంతో నెలకు రూ.1000 ఇస్తానని కొత్త నాటకానికి తెరలేపారన్నారు. అందరి జీవితాలతో చెలగాటం ఆడుతున్న బాబుకు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. సాగర్‌లో పుష్కలంగా నీరు ఉన్నా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ స్వార్థం కారణంగా కాలువలకు నీరు రాక నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయన్నారు. కాలువ లైనింగ్‌ పనులకు ఎక్కడా లేని విధంగా 25 శాతం ఎక్కువగా సింగిల్‌ టెండర్‌ వేసి కోట్లు దోచుకోవటానికి కాలువకు నీళ్లు రాకుండా చేస్తున్నారన్నారు.

 కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ పంచాయతీ విభాగపు జిల్లా అధ్యక్షుడు తన్నీరు నాగేశ్వరరావు, యువ నాయకులు సామినేని వెంకటకృష్ణ ప్రసాద్, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి పీ సునీల్, విజయవాడ పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు సంపత్‌ విజిత, నియోజకవర్గ యూత్‌ విభాగపు అధ్యక్షులు మార్కపూడి గాంధీ, నియోజకవర్గ ఎస్సీసెల్‌ కన్వీనర్‌ బూడిద నరసింహారావు, వత్సవాయి, జగ్గయ్యపేట మండల కన్వీనర్లు గాదెల రామారావు, చిలుకూరి శ్రీనివాసరావు, మండల ప్రచార కార్యదర్శి చింతకుంట్ల వెంకటరెడ్డి, డబ్బాకుపల్లి సొసైటీ అధ్యక్షులు చెంబేటి వెంకటేశ్వర్లు, మండల వాణిజ్య, మైనార్టీ, ఎస్టీసెల్, యూత్‌ అధ్యక్షులు పోలా నాగభూషణం, రన్‌ హస్సేన్, లావుడియా మగతానాయక్, నేలవెల్లి వెంకటప్పయ్య, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top