'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు' | chandra babu is a drama master, says chevireedy bhaskarreddy | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు'

Jun 27 2015 5:44 PM | Updated on Oct 29 2018 8:34 PM

'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు' - Sakshi

'చంద్రబాబు.. ఓ డ్రామాల మాస్టారు'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ డ్రామాల మాస్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ డ్రామాల మాస్టారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి విమర్శించారు. విశాఖలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... శాంతి భద్రతల సమస్య లేనప్పుడు.. హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు చేయాల్సిన అవసరం గవర్నర్ నరసింహన్కు లేదని ఆయన పేర్కొన్నారు. బీజేపీతో కలిసి కాపురం చేస్తున్నప్పుడు వాళ్లచేతే సెక్షన్ 8 అమలు చేయించుకోవాలని ఆయన ఎద్దేవా చేశారు.

పబ్లిసిటీ కోసం డ్రామాలెందుకని ఈ సందర్భంగా చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే.. ఆయన వాయిస్ కరెక్టేనని బీజేపీ నమ్మిందని చెవిరెడ్డి పేర్కాన్నారు. ఆ కారణంతో బీజేపీ కార్యకర్త కూడా కనీసం మద్దతివ్వడం లేదన్నారు. పరిపాలన చేసేటప్పుడు హుందాగా ఉందాలని, 'ఓటుకు కోట్లు' కేసులో తప్పు చేయలేదంటే తప్పు చేయలేదని చెప్పాలి.. లేదంటే శిక్షకు సిద్ధపడాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement