రెడ్‌ జోన్‌గా ప్రకాశం 

Central Government To Announce Prakasam District Is Red Zone Due To Corona - Sakshi

ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 

మరో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు నమోదు  

జిల్లాలో 24కు చేరుకున్న పాజిటివ్‌ కేసులు 

అందుబాటులో మాస్‌్కలు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు 

సాక్షి, ఒంగోలు: కోవిడ్‌–19 వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లాను రెడ్‌ జోన్‌ పరిధిలోకి  తీసుకువచ్చింది. రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమైన కేంద్రం తగు చర్యలను సూచించింది. జిల్లాలో ఇప్పటి వరకూ 24 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీటిలో 23 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్‌ ప్రార్థనతో సంబంధం ఉన్నవే ఉన్నాయి. నిజాముద్దీన్‌ మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని జిల్లా అధికారులు గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నారు. జిల్లాలో కోవిడ్‌–19 అత్యధికంగా ప్రబలే అవకాశం ఉండటంతో కఠిన చర్యలు తీసుకోనున్నారు. లాక్‌డౌన్‌ను మరింత కఠినతరం చేయనున్నారు. ఇప్పటికే కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారు. అయితే జిల్లాను రెడ్‌ జోన్‌గా కేంద్రం ప్రకటించినందున లాక్‌డౌన్‌ నిబంధనల్లో మార్పులు చేయనున్నారు.  

కొనకనమిట్ల మండలంలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసు 
జిల్లాకు చెందిన శాంపిల్స్‌లో మరో కోవిడ్‌–19 పాజిటివ్‌గా నిర్ధారిస్తూ ల్యాబ్‌ అధికారులు జిల్లా అధికారులకు నివేదికలు పంపించారు. దీంతో జిల్లాలో కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులు 24కు చేరుకున్నాయి. సోమవారం ల్యాబ్‌ అధికారుల నుంచి అందిన 76 నివేదికల్లో ఒకటి పాజిటివ్‌గా నిర్ధారించారు. కొనకనమిట్ల మండలం వెలిగండ్ల గ్రామానికి చెందిన యువకుడు ఢిల్లీలో మానవాభివృద్ధి శాఖలో పనిచేస్తున్నాడు. కరోనా లక్షణాలు ఉండటంతో ఈ నెల ఒకటో తేదీన ఒంగోలు జీజీహెచ్‌లో చేర్చారు. పరీక్షల అనంతరం కరోనా పాజిటివ్‌గా తేలడంతో కుటుంబ సభ్యులను కూడా జీజీహెచ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.       

అందరూ ఆరోగ్యంగా ఉన్నారు 
జిల్లా నుంచి ల్యాబ్‌కు పంపిన 206 కోవిడ్‌–19 శాంపిల్స్‌ నివేదికలు రావాల్సి ఉందని ఒంగోలు జీజీహెచ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ డి.శ్రీరాములు తెలిపారు. ఇప్పటి వరకు 339 శాంపిల్స్‌ నెగటివ్‌గా నిర్ధారణ అయ్యాయని చెప్పారు. జీజీహెచ్‌లో కోవిడ్‌–19 పాజిటివ్‌ వ్యక్తులందరూ ఆరోగ్యంగా ఉన్నారని పేర్కొన్నారు. కొన్ని కేసులను కిమ్స్‌ వైద్యశాలకు తరలించామన్నారు. ఒకరికి ఇతర అనారోగ్య కారణాలు ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించినట్లు తెలిపారు. ఆయన ఆరోగ్యం కూడా నికలడగా ఉందని అక్కడి వైద్యులు చెప్పారన్నారు.  

క్వారన్‌టైన్, ఐసోలేషన్‌కు 826 గదులు 
జిల్లాలో కోవిడ్‌–19 వైరస్‌ అనుమానితులను ఉంచేందుకు, పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స చేసేందుకు 826 గదులను సిద్ధంగా ఉంచారు. ఈ గదులన్నిటికీ ప్రత్యేక మరుగుదొడ్లు ఉన్నాయి.

ప్రత్యేక వైద్యులు, నర్సులు 
కోవిడ్‌–19 వైరస్‌ పాజిటివ్‌ వ్యాధిగ్రస్తులకు చికిత్స చేసేందుకు అనుభవం ఉన్న వైద్యులు 30 మంది, నైపుణ్యం కలిగిన 56 మంది నర్సులను నియమించారు. ఇప్పటి వరకు 311 మందిని ఐసీయూలో అడ్మిట్‌ చేశారు.

పూర్తి స్థాయిలో చికిత్స కిట్లు 
జిల్లాలో కోవిడ్‌–19 వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది వాడే పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ కిట్లు(పీపీఈ) 3,560 అందుబాటులో ఉన్నాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వాడే ఎన్‌ 95 మాసు్కలు 5,477, గ్లవ్స్‌ 1,60,611, సర్జికల్‌       మాసు్కలు 1,21,140, శానిటైజర్లు 15003, వెంటిలేటర్లు 37 ఉన్నాయి.  

చీమకుర్తిలో శానిటైజర్‌ టన్నెల్‌ 
చీమకుర్తి: చీమకుర్తిలోని బీవీఎస్‌ఆర్‌  ఇంజినీరింగ్‌ కాలేజీలోని కరోనా  క్వారంటైన్‌ సెంటర్‌లో ఆటో శానిటైజర్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశారు. ఈ టన్నెల్‌ను సోమవారం సాయంత్రం చీమకుర్తి  తహసీల్దార్‌ విజయకుమారి ప్రారంభించారు. క్వారంటైన్‌ సెంటర్‌లో కరోనా అనుమానిత లక్షణాలు కలిగిన వ్యక్తులకు ఆహారం, మంచినీరు, వైద్యం, ఇతర అవసరాలు తీర్చేందుకు రాకపోకలు సాగించే వ్యక్తుల రక్షణ కోసం  ఈ ఆటో శానిటైజర్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశారు. ఈ పరికరాన్ని చీమకుర్తికి చెందిన ఇంజినీరింగ్‌ వర్క్స్‌లో నిపుణులైన షేక్‌ షఫీ, హెచ్‌ సుబ్బారెడ్డి స్వచ్ఛందంగా రూపొందించారు.  

శానిటైజర్‌ టన్నెల్‌లో తహసీల్దార్‌పై ఆటోమేటిక్‌గా సోడియం హైపో క్లోరైట్‌ స్ప్రే    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-05-2020
May 30, 2020, 05:50 IST
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్‌ చెక్‌ చేసే రైల్వే టికెట్‌...
30-05-2020
May 30, 2020, 05:21 IST
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్న 101 మందిని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి చేసినట్లు వైద్య ఆరోగ్య...
30-05-2020
May 30, 2020, 05:15 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 కొనసాగింపుపై కేంద్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్న వేళ దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 24...
30-05-2020
May 30, 2020, 04:57 IST
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ 4.0 ముగిసిన తరువాత కరోనా వ్యాప్తిని నిరోధించే చర్యల విషయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకే అధికారం ఇవ్వాలని...
30-05-2020
May 30, 2020, 04:53 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19ను ఎదుర్కొ నేందుకు అన్ని రకాలుగా సర్వసన్నద్ధంగా ఉన్నా మని, ఎవరూ భయపడవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
30-05-2020
May 30, 2020, 04:26 IST
ప్రపంచ మార్కెట్లు పతన బాటలో ఉన్నా, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నా శుక్రవారం మన మార్కెట్‌ ముందుకే దూసుకుపోయింది....
30-05-2020
May 30, 2020, 04:02 IST
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి సంబంధించి ఎనిమిది పారిశ్రామిక విభాగాల గ్రూప్‌ ఏప్రిల్‌లో దారుణ ఫలితాన్ని చూసింది. ఈ గ్రూప్‌లోని పరిశ్రమల...
30-05-2020
May 30, 2020, 03:49 IST
న్యూఢిల్లీ: అందరి అంచనాలకు అనుగుణంగానే భారత స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 2019 ఏప్రిల్‌ –2020 మార్చి ఆర్థిక సంవత్సరంలో...
30-05-2020
May 30, 2020, 02:00 IST
సోషల్‌ మీడియాలో శుక్రవారం సందడి చేశారు సమంత. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఈ లాక్‌డౌన్‌ సమయంలో సమంత...
29-05-2020
May 29, 2020, 22:33 IST
మరో ఐదుగురు వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చిన వారిలో 64 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వెల్లడించారు. ...
29-05-2020
May 29, 2020, 21:24 IST
మహారాష్ట్రలోని తలోజా జైలులో ఉన్న విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు (80) శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.
29-05-2020
May 29, 2020, 21:00 IST
ఆటోలు 1+2, కార్లు 1+3, మినీ వ్యాన్లు 50 శాతం ప్రయాణికులను చేరవేసేందుకు అనుమతి ఇస్తున్నాం. 
29-05-2020
May 29, 2020, 20:50 IST
సాక్షి, ప్రకాశం: అమెరికాలో నివసిస్తున్న తెలుగువారు ‘టామాటో ఛాలేంజ్’‌ పేరుతో జిల్లాలోని రైతులకు భరోసానిస్తున్నారు. అంతేగాక లాక్‌డౌన్‌లో తిండి దొరక్క ఇబ్బందులు పడుతున్న‌ పేదవారికి...
29-05-2020
May 29, 2020, 20:00 IST
ముంబై వలస వెళ్లిన ఓ వ్యక్తి ఇంటికి తిరుగు పయనమయ్యే క్రమంలో..
29-05-2020
May 29, 2020, 18:56 IST
వెల్లింగ్ట‌న్‌‌: అనుకోకుండా ముంచుకొచ్చిన‌‌ క‌రోనా విప‌త్తు వ‌ల్ల ఇప్ప‌టికీ ఎన్నో దేశాలు అత‌లాకుత‌లం అవుతున్నాయి. నానాటికీ కేసుల సంఖ్య పెరుగుతూ డేంజ‌ర్...
29-05-2020
May 29, 2020, 17:02 IST
సాక్షి, న్యూఢిల్లీ : నేడు దేశాన్ని కరోనా వైరస్‌ కుదిపేస్తున్న నేపథ్యంలో వైరస్‌ల బారిన పడకుండా రక్షించుకునేందుకు వైద్య సిబ్బంది...
29-05-2020
May 29, 2020, 17:00 IST
పట్నా : రెండు రోజుల క్రితం బిహార్‌లోని ముజఫర్‌నగర్‌ రైల్వే స్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌పై తల్లి మృతదేహాన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించిన ఒక...
29-05-2020
May 29, 2020, 16:24 IST
సాక్షి, అమరావతి : దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణకు కేంద్ర విధించిన నాలుగో విడత లాక్‌డౌన్‌ ఆదివారంతో ముగియనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌...
29-05-2020
May 29, 2020, 16:24 IST
కాలిఫోర్నియా: 'చికిత్స క‌న్నా నివార‌ణ మేలు' అనే మాట‌ క‌రోనాకు స‌రిగ్గా స‌రిపోతుంది. మందు లేని ఈ మాయ‌దారి రోగానికి మ‌నం...
29-05-2020
May 29, 2020, 15:50 IST
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 11638...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top