
విజయమ్మ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తున్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాయచోటి రూరల్ : వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలను గురువారం రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఎస్‌ఎన్ కాలనీలోని తన కార్యాలయంలో పలువురు నాయకులు, కార్యకర్తలతో కలిసి విజయమ్మ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురికి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో నాయకులు కుమార్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, సురేంద్ర, విష్ణు, జయరామిరెడ్డి, శివారెడ్డి, కొండారెడ్డి, మధుసూదన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ
విజయమ్మ జన్మదిన వేడుకల్లో భాగంగా వైఎస్ జగన్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి అధ్వర్యంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అనంతరం శివాలయం, సాయిబాబా ఆలయంలో విజయమ్మ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో శివానందరెడ్డి, సుబ్బరాయుడు, సుధాకర్ పాల్గొన్నారు.