ఏపీ సీఎస్‌ వివరణ కోరిన సీఈసీ

CEC Asks Explanation AP CS Anil Punetha Over Intelligence Chief Transfer Issue - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేం‍ద్ర ఎన్నికల సంఘంతో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌ పునేథ సోమవారం సమావేశమయ్యారు. ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బదిలీ జీవో వ్యవహారంపై సీఈసీ వివరణ కోరింది. ఈ మేరకు ఆయన ఎన్నికల సంఘం అధికారులతో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఇంటలెజిన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును బదిలీ చేస్తూ 716 జీవో జారీ చేసిన తర్వాత, ఆ జీవోను రద్దు చేసి 720, 721 జీవోలను ఎందుకు జారీ చేశారంటూ సీఈసీ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో సమావేశం ముగిసిన తర్వాత అనిల్‌ పునేథ ముభావంగా వెళ్లిపోయారు. సీఎం చంద్రబాబు ఒత్తిడి మూలంగానే సీఈసీ ఆదేశాలకు విరుద్ధంగా జీవో జారీ చేయాల్సి వచ్చిందని ఆయన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం.(చదవండి : ఎంత చెప్పినా సీఎం వినలేదు.. కోర్టుకెళ్లి తప్పు చేశాం..!)

కాగా ఏపీ ఇంటెలిజెన్స్‌ విభాగం చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును తప్పించాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఇచ్చిన ఆదేశాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తుంగలో తొక్కింది. ఆయనను ఐబీ చీఫ్‌గా తప్పించి డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తున్నట్లు గత మంగళవారం జీవో (నంబర్‌ 716) ఇచ్చిన ప్రభుత్వం.. మరునాడే ఆ జీవోను రద్దు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నం బరు 720 జారీ చేసింది. అదే విధంగా సీఈసీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది కూడా . దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఏపీలో అధికారుల బదిలీలకు సంబంధించి ఈసీ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ శుక్రవారం తీర్పును వెలువరించింది. అంతేకాకుండా ఈసీ ఆదేశాలను శిరసావహించాల్సిందేనని ప్రభుత్వానికి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top