తహశీల్దార్ కార్యాలయంలో సీబీఐ విచారణ | CBI Trial at MRO Office | Sakshi
Sakshi News home page

తహశీల్దార్ కార్యాలయంలో సీబీఐ విచారణ

Aug 18 2015 3:44 PM | Updated on Sep 3 2017 7:40 AM

సబ్సిడీ విత్తనాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ..అనంతపురం జిల్లా గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రైతులను విచారించింది.

గుత్తి (అనంతపురం) : సబ్సిడీ విత్తనాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ..అనంతపురం జిల్లా గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రైతులను విచారించింది. 2011 నుంచి 2013 వరకు మండలంలోని మార్నేపల్లెకు చెందిన 11 మంది రైతులకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి సబ్సిడీ విత్తనాలు అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది.

ఈ మేరకు సంబంధిత రైతులను పిలిపించి తహశీల్దార్ హరిప్రసాద్ సమక్షంలోవివరాలు నమోదు చేసుకున్నారు. కాగా దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement