breaking news
Subsidized seed distribution
-
తహశీల్దార్ కార్యాలయంలో సీబీఐ విచారణ
గుత్తి (అనంతపురం) : సబ్సిడీ విత్తనాల పంపిణీపై రాష్ట్ర వ్యాప్తంగా దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ..అనంతపురం జిల్లా గుత్తి మండల తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం రైతులను విచారించింది. 2011 నుంచి 2013 వరకు మండలంలోని మార్నేపల్లెకు చెందిన 11 మంది రైతులకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కృష్ణారెడ్డి సబ్సిడీ విత్తనాలు అందించినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. ఈ మేరకు సంబంధిత రైతులను పిలిపించి తహశీల్దార్ హరిప్రసాద్ సమక్షంలోవివరాలు నమోదు చేసుకున్నారు. కాగా దీనిపై మరింత సమాచారాన్ని వెల్లడించేందుకు సీబీఐ అధికారులు నిరాకరించారు. -
ముందు చూపు లేదా?
సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వ వైఫల్యంపై విపక్షాల ధ్వజం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకర్నారాయణ అనంతపురం క్రైం : జిల్లాలో ఎంతమంది రైతులున్నారు..? ఎన్ని క్వింటాళ్లు సబ్సిడీ విత్తన వేరుశనగ కాయలు కా వాలి..? గతంలో ఎన్ని క్వింటాళ్లు దిగు మతి అయ్యేవి..? అనే విషయాలపై ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ యం త్రాంగానికి ముందు చూపు లేదా..? అని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్నారాయణ ప్రశ్నిం చారు. విత్తన వేరుశనగ పంపిణీపై ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో రైతులకు విత్తన వేరుశనగ పంపిణీలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. జిల్లాకు దాదాపు 5 లక్షల క్వింటాళ్లు వరకు వేరుశనగ కాయలు అవసరం కాగా, ప్రభుత్వం 2 లక్షల 11 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించి రైతులకు సరఫరా చేసిందన్నారు. సగం మంది రైతులు విత్తనం అందక ఇబ్బంది పడుతున్నారన్నారు. పైగా సబ్సిడీ తగ్గించి అధిక ధరతో ప్రభుత్వం రైతులపై భారం మోపిందన్నారు. రైతులకు ఇప్పటి వరకు సరఫరా చేసిన విత్తన కాయల్లో దాదాపు 35 శాతం నాసిరకం కాయలున్నాయని పేర్కొన్నారు. విత్తన కాయల కోసం మూడు మాసాల కిందటే కలెక్టర్, వ్యవసాయాధికారులు సమావేశమై ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేయాలన్నారు. రాష్ట్ర స్థాయిలో విత్తన కాయలపై కమిటీ సమావేశం నిర్వహిస్తారన్నారు. వీటిని నిర్వహించకుండా, సరిపడు విత్తన కాయలు సరఫరా చేయకుండా ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ప్రతి రైతుకు అవసరమైన మేరకు విత్తనకాయలు సరఫరా చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి జిల్లా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ అనంతపురం అర్బన్ : ప్రజా సంక్షేమ, రాజ్యాంగపర పాలనలో పూర్తిగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు కేవీరమణ, డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నాగరాజు పార్టీ కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. వేరుశనగ విత్తనకాయ పంపిణీలో ప్రభుత్వం, అధికార యంత్రాంగం పూర్తిగా వైఫలం చెందిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఇవ్వడంలోనూ, రుణామాఫీ విషయంలోనూ రైతాంగాన్ని ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు. ఇందుకు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ అధికార పార్టీ నాయకునిలా వ్యహరిస్తూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఏడాది పాలనలో ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. గవర్నర్ వ్యవస్థ, రాజ్యాంగంపై గౌరవం లేని ప్రభుత్వాన్ని తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.