అవినాష్ అనుచరుడుపై కేసు నమోదు | Case filed on Cheater Avinash follower Subramanian | Sakshi
Sakshi News home page

అవినాష్ అనుచరుడుపై కేసు నమోదు

Mar 14 2015 6:18 PM | Updated on Mar 29 2019 9:11 PM

ఘరానా మోసగాడు అవినాష్ అనుచరుడు సుబ్రహ్మణ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.

విజయవాడ: ఘరానా మోసగాడు అవినాష్ అనుచరుడు సుబ్రహ్మణ్యంపై మాచవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అంతర్జాతీయ మానవహక్కుల కమిటీలో పదవి ఇప్పిస్తామంటూ.. రూ. 3లక్షలను సుబ్రహ్మణ్యం తీసుకుని మోసం చేసాడంటూ బీజేపీ నేత గురునాథ్ ఆరోపించారు.

డబ్బు తిరిగి ఇవ్వమంటే తనపై సుబ్రహ్మణ్యం బెదిరింపులకు పాల్పడుతున్నాడంటూ గురునాథ్ పోలీసులను అశ్రయించారు. ఆయన ఫిర్యాదు మేరకు సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసినట్టు మాచవరం పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement