సమ్మర్‌లో బైకులపై కేర్‌ఫుల్ | carefull on bikes in summer | Sakshi
Sakshi News home page

సమ్మర్‌లో బైకులపై కేర్‌ఫుల్

May 11 2015 2:13 AM | Updated on Sep 3 2017 1:48 AM

సమ్మర్‌లో బైకులపై కేర్‌ఫుల్

సమ్మర్‌లో బైకులపై కేర్‌ఫుల్

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎండలు మొదలయ్యాయి.

మైదుకూరు(చాపాడు) : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఎండలు మొదలయ్యాయి. గత రెండు నెలల్లోకంటే ఎక్కువగా మే నెలలో ఎండలు మండిపోతున్నాయి. సాయంత్రమవుతున్నా భానుడి ప్రతాపం ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ తాము ఎండ తాపం నుంచి ఏ విధంగా సేద తీరాలనే ఆలోచిస్తుంటారు.

కానీ ప్రజల ఆవసరాల కోసం వినియోగించే వాహనాలపై యజమానులు తగిన శ్రద్ధ చూపాలని, లేకపోతే ఎండలకు వాహనాలు తెబ్బతినటమే కాకుండా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఇంధనాలపై మరింత అధనంగా ఖర్చు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు ఆటో మొబైల్ నిపుణులు.

► ద్విచక్ర వాహనాలు ఎక్కువ సేపు ఎండలో ఉండటం వల్ల ట్యాంకుల్లోని పెట్రోల్, డిజిల్ సూర్యార్పణం అయిపోతుంది. వాహనాల కలర్  కూడా షేడ్ అయి, కొత్త బండి కూడా పాత బండిలాగా కన్పిస్తుంది.
► వాహనాలు పార్క్ చేసేటప్పుడు వాటిపై తప్పనిసరిగా కవర్లు కప్పి ఉంచాలి, రాత్రి సమయాల్లో పెట్రోలు పట్టించుకోవటం మేలు. ఆ సమయంలో ఎండతీవ్రత తక్కువగా ఉండి పెట్రోలు ఎక్కువగా ఆవిరి కాకుండా ఉంటుంది.
► అధిక వేడి వల్ల టైర్లలో తరచూ గాలి తగ్గిపోతూ ఉంటుంది. గమనించి సరైన మోతాదులో గాలి నింపుకోవాలి. గాలి తక్కువ ఉండి ఎక్కువ కాలం వాహనాన్ని నడిపితే టైర్ల మన్నిక తగ్గిపోతుంది.
► వేసవిలో ద్విచక్ర వాహనాల్లో సుదూర ప్రయాణాలు చేయకపోవటం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ప్రతి 50 కిలో మీటర్లకొకసారి బండిని 15 నిమిషాలు ఆఫ్ చేయాలి. దీని వల్ల ఇంజిన్ చల్లబడి అధిక మన్నిక వస్తుంది.
► ఎండ వల్ల ఇంజిన్ ఆయిల్ త్వరగా తన శక్తిని కోల్పోతుంది. దీని వల్ల ఇంజిన్ మన్నిక తగ్గుతుంది. కాబట్టి ఇంజిన్ ఆయిల్‌ను 15 రోజులకొకసారి చెక్ చేసుకోవాలి. వారంలో ఒకసారైనా బ్రేక్ షూలు, రబ్బర్ విడి భాగాలు చెక్ చేసుకోవాలి. అధిక వేడి వల్ల రబ్బర్ విడి భాగాలు త్వరగా పాడవుతాయి.
► రే డియేటర్‌లో నీళ్లను తరచూ చెక్ చేసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం ఉంది. రేడియేటర్లలో నీళ్లకంటే కూలెంటు ఆయిల్ వాడటం మంచిది. ఇంజిన్ ఆయిల్ తగ్గే ప్రమాదం ఉండటంతో అప్పుడప్పుడూ అయిల్ లెవెల్ చెక్ చేసుకోవాలి.
► ఎండాకాలం పూర్తయ్యే వరకు కొత్త టైర్లు వాడాలి. సెకండ్ హ్యాండ్, చైనా, బటన్ టైర్ల జోలికి వె ళ్లకపోవటం మంచిది.
► ఇప్పుడొస్తున్న వాహనాలన్నీ ఫ్యూజులు, కంప్యూటర్లతో అనుసంధానం చేయబడి ఉంటున్నాయి. కావున వాహనంలోని వైరింగ్ వ్యవస్థను ప్రతి 15 రోజులకోసారి క్షుణ్నంగా చెక్ చేసుకోవాలి.
► ఎల్‌పీజీ వాహనలు ఉపయోగించే వారు  ఈ వేసవిలో వాటికి దూరంగా ఉండటం మంచిది. అధిక ఉష్ణోగ్రతల వల్ల గ్యాస్ అధిక పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం వేళల్లో వాడటం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement