సీ-శాట్ విధానాన్ని రద్దు చేయండి | c-Set policy to cancel - mp avinash reddy | Sakshi
Sakshi News home page

సీ-శాట్ విధానాన్ని రద్దు చేయండి

May 7 2015 1:56 AM | Updated on Sep 22 2018 7:37 PM

సివిల్ సర్వీసు పరీక్షల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత సీ-శాట్ విధానాన్ని రద్దు

ప్రధాని, రాష్ట్రపతికి ఏపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విజ్ఞప్తి
 
కడప కార్పొరేషన్: సివిల్ సర్వీసు పరీక్షల్లో గ్రామీణ ప్రాంత అభ్యర్థుల ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న ప్రస్తుత సీ-శాట్ విధానాన్ని రద్దు చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి వినతి పత్రం సమర్పించారు. ఆ ప్రతిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా పంపించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత విధానం వల్ల ఐఐటీ, ఐఐఎం లలో చదివి గణితం, ఆంగ్లంపై పట్టున్న వారికే లబ్ధి చేకూరుతోందన్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో మిగతా సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement