హైదరాబాద్ వైద్యుడికి ‘సీకాట్’ ప్రత్యేక అవార్డు | c cat special award to hyderabad doctor | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ వైద్యుడికి ‘సీకాట్’ ప్రత్యేక అవార్డు

Oct 21 2013 4:00 AM | Updated on Sep 4 2018 5:07 PM

హైదరాబాద్ వైద్యుడికి ‘సీకాట్’ ప్రత్యేక అవార్డు - Sakshi

హైదరాబాద్ వైద్యుడికి ‘సీకాట్’ ప్రత్యేక అవార్డు

వెన్నుపూస, కీళ్ల వ్యాధులకు సంబంధించి రికార్డు స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించిన తెలుగు వైద్యుడు జె.నరేష్‌బాబుకు సీకాట్ ప్రత్యేక అవార్డు ప్రదానం చేసింది.

సాక్షి, హైదరాబాద్: వెన్నుపూస, కీళ్ల వ్యాధులకు సంబంధించి రికార్డు స్థాయిలో పరిశోధనా పత్రాలు సమర్పించిన తెలుగు వైద్యుడు జె.నరేష్‌బాబుకు సీకాట్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్ అండ్ ట్రమటాలజీ) ప్రత్యేక అవార్డు ప్రదానం చేసింది. గత మూడు రోజులుగా హైదరాబాద్‌లో సీకాట్ సదస్సు జరిగింది. అంతర్జాతీయ ఆర్థోపెడిక్ సదస్సుల్లో ఒక వైద్యుడు ఏడు పరిశోధనా పత్రాలు సమర్పించడం ఇదే ప్రథమం. 84 దేశాలకు చెందిన ఆర్థోపెడిక్, వెన్నుపూస వైద్య నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని మెడిసిటీ ఆస్పత్రిలో వెన్నుపూస వైద్యుడిగా పనిచేస్తున్న జె.నరేష్‌బాబు ఇందులో ఏడు పరిశోధనా పత్రాలను సమర్పించారు. అంతర్జాతీయంగా మొత్తం 400 పరిశోధనా పత్రాలు రాగా.. అందులో భారత్ నుంచి 30 వచ్చాయి. ఇందులో ఏడు పత్రాలు నరేష్ బాబువే. ఒక వైద్యుడు ఏడు పరిశోధనా పత్రాలు సమర్పించడం అరుదైన అంశమని, అందుకే ఆయనకు ప్రత్యేక అవార్డు ప్రకటిస్తున్నామని సీకాట్ సదస్సు నిర్వాహకులు తెలిపారు. 80 ఏళ్ల క్రితం ఏర్పడిన సీకాట్ సంస్థలో సుమారు ఐదువేల మంది సభ్యులున్నారు. సదస్సు ముగింపు రోజైన ఆదివారం నరేష్‌కు అవార్డు అందజేశారు.
 
 50 శాతం ఐఆర్ చెల్లించండి: ఎస్టీయూ
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లోని ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు గత జూలై నుంచి వర్తించేలా 50 శాతం తాత్కాలిక భృతి(ఐఆర్)ని చెల్లించాలని ఎస్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భుజంగరావు, నర్సింహారెడ్డి ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement