పిడుగుపాటుకు బాలుడి మృతి | Boy Died in Prakasam | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు బాలుడి మృతి

Apr 23 2019 2:04 PM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Died in Prakasam - Sakshi

చికిత్స పొందుతున్న సాత్విక్‌ నాయక్‌

గిద్దలూరు రూరల్‌: పిడుగుపాటుకు బాలుడు మృతి చెందగా అతడి సోదరుడు, తల్లి గాయపడ్డారు. ఈ సంఘటన మండలంలోని ఓబులాపురం తండాలో సోమవారం జరిగింది. అందిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుక్కె వెంకటేశ్వర నాయక్, లక్ష్మీబాయిల కుమారుడు సుశాంత్‌నాయక్‌(4) పిడుగు కారణంగా మృతి చెందాడు. సాయంత్రం వీచిన ఈదురు గాలులు, ఉరుములతో కూడిన పిడుగు పడటంతో ఇంట్లో ఉన్న సుశాంత్‌ నాయక్‌ మృతి చెందాడు.

తల్లి లక్ష్మీబాయి, ఆమె మరో కుమారుడు సాత్విక్‌ నాయక్‌లకు గాయాలయ్యాయి. అనంతరం స్థానికులు క్షతగాత్రులను చికిత్స కోసం పట్టణలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సుశాంత్‌ మృతిపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముక్కుపచ్చలారని తన బిడ్డ పిడుగు కారణంగా మృతి చెందడంతో తల్లి లక్ష్మీబాయి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి తహసీల్దార్‌ రూ.10 వేలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement