పేదల ఇళ్లకు ప్రభుత్వ భూములు కేటాయిస్తాం: బొత్స

Botsa Satyanarayana: Will use Govt Lands For House Constructions - Sakshi

సాక్షి, అమరావతి : ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాలు అందిస్తామని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించారని మంత్రి తెలిపారు. పేదల ఇళ్ల కోసం ప్రభుత్వ భూములు కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లో 11 వేల ఎకరాల భూమి అవసరమని గుర్తించామని, అవసరమైతే భూములు కొనుగోలు చేసి పేదలకు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రైవేట్‌ స్థలాల కొనుగోలుకు రూ. 12 వేల కోట్లు ఖర్యు అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు. ఎక్కడా అవినీతికి తావులేకుంగా పేదలకు ఇచితంగా ఇళ్ల స్థలాలు ఇస్తామని, అంతేగాక ఇళ్ల స్థలాన్ని లబ్ధిదారుడి పేరిట రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top