జిల్లాలో సమైక్యపోరు జోరు తగ్గడం లేదు. ఉద్యమ జ్వాల రగులుతూనే ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా, జగన్‌కు సంఘీభావంగా...
జిల్లాలో సమైక్యపోరు జోరు తగ్గడం లేదు. ఉద్యమ జ్వాల రగులుతూనే ఉంది. సమైక్యాంధ్రకు మద్దతుగా, జగన్‌కు సంఘీభావంగా యలమంచిలి వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.
వెయ్యికి పైగా బైక్‌లతో జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టారు. మునగపాక, యలమంచిలి, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల మీదుగా సుమారు వంద కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించారు. చోడవరం నియోజకవర్గంలోనూ భారీ ర్యాలీ సాగింది. రాష్ట్ర విభజనకు నిరసనగా ఏజెన్సీ 11 మండలాల్లో బంద్ విజయవంతమైంది.