ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం | bojjala gopalakrishna reddy clarifies on resigns his mla post | Sakshi
Sakshi News home page

‘చాలా బాధగా ఉంది...అందుకే ఆ నిర్ణయం’

Apr 13 2017 11:39 AM | Updated on Jul 23 2018 7:01 PM

ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం - Sakshi

ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం

మంత్రివర్గం నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

శ్రీకాళహస్తి: మంత్రివర్గం నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను కేబినెట్‌ నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని,  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై ఈ నెల 15న తుది నిర్ణయం తీసుకుంటానన్నారు.

కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని ఆయన తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, అయితే ఈ కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఈ చర‍్యకు బాధపడే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని మీడియకు తెలియచేస్తానని బొజ్జల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement