విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో ఈదురుగాలులకు సముద్రంలో లంగరువేసివున్న మూడు నాటుపడవలు బోల్తా పడ్డాయి.
మూడు నాటు పడవలు బోల్తా
Jul 19 2017 4:02 PM | Updated on Sep 5 2017 4:24 PM
భోగాపురం: విజయనగరం జిల్లా భోగాపురం మండలం చేపలకంచేరులో ఈదురుగాలులకు సముద్రంలో లంగరువేసివున్న మూడు నాటుపడవలు బోల్తా పడ్డాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో విజయనగరం జిల్లాలో సముద్ర తీరప్రాంత కల్లోలంగా మారింది. భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకార గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వస్తున్నాయి. మరోవైపు సముద్రంలో గాలులు బలంగా వస్తుండటంతో మంగళవారం అర్ధరాత్రి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారు.
వేట నిలిపివేసి లంగరువేసివున్న మూడు నాటుపడవలు చేపలకంచేరుకు సమీపంలో గాలుల తాకిడికి బోల్తా పడ్డాయి. దీంతో మిగిలిన మత్స్యకారులు వెనక్కి తిరిగొస్తున్నారు. మరోవైపు తీరం వెంబడి బలంగా ఈదురు గాలులు వీస్తున్నాయి . పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. రెవెన్యూ అధికారులు ఎవరూ కనీస సమాచారం ఇవ్వలేదని గంగపుత్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement