కడప నగరంలో బీజేపీ శ్రేణుల ర్యాలీ

BJP  Rally In YSR Kadapa - Sakshi

కడప కోటిరెడ్డిసర్కిల్‌ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కడపకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు నగర శివార్లలో పార్టీ నేతలు, కార్యకర్తలు  స్వాగతం పలికారు. అనంతరం అక్కడ నుంచి వైఎస్సార్‌ సర్కిల్, సంజన్న సర్కిల్, అప్సర సర్కిల్‌ మీదుగా అంబేడ్కర్‌ సర్కిల్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత కందుల ఎస్టేట్‌ వరకు ర్యాలీగా వెళ్లారు.
నగరంలోని కందుల ఎస్టేట్‌లో పలువురు ముస్లింలు  కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. 
శనివారం రాత్రి  అల్మాస్‌పేటలోని ఎస్టీ కాలనీలో కన్నా లక్ష్మీనారాయణ పర్యటించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  అనంతరం వారితోపాటు సహఫంక్తి భోజనంలో పాల్గొన్నారు. బీజేపీ నాయకులు కందుల రాజమోమన్‌రెడ్డి, శ్రీనాథ్‌రెడ్డి, హరినాథరెడ్డి, సుంకర శ్రీనివాస్, పెసల సాంబశివారెడ్డి, పట్నం ఎరికలప్ప, లక్ష్మణ్‌రావు, బండి ప్రభాకర్, దుర్గం దస్తగిరి, మాకం అశోక్‌కుమార్, హరి నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top