కర్నూలులో హైకోర్టు డిమాండ్‌ చేసింది బీజేపీనే: జీవీఎల్‌

BJP MP GVL Narasimha Rao Demand To Kurnool High Court - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని దీక్ష చేస్తున్న న్యాయవాదులకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంఘీభావం తెలిపారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని మొదటగా డిమాండ్ చేసింది బీజేపీనేని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేస్తారని కోరుతున్నామన్నారు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు ప్రస్తుత సీఎం జగన్ చేయరని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 2 నుంచి పదిహేను రోజులపాటు ప్రజా సమస్యలపై, రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహిస్తామని వెల్లడించారు. జల సంరక్షణ పథకం ద్వారా దేశంలోని ప్రతి కుటుంబానికి మంచినీటి సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జీవీఎల్‌ తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top