
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో అధికారంలోకి రావాలనే ఉద్దేశ్యంతో గాలి దీక్షలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దోచుకున్న సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు వైఖరి బయటపడిందని తెలిపారు. టీడీపీకి ఓటు వేయని వారి పేర్లు ఓటర్ లిస్ట్ నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి టీడీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని అన్నారు.