పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి చెందాడు.
ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండలం కూరెళ్లగూడెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ నేత మృతి చెందాడు. కారు అదుపు తప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న భోగిరెడ్డి శ్రీనివాసరావు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు బంధువులుగా పోలీసులు గుర్తించారు.