గేదెకు పుట్టినరోజు వేడుక | birthday celebration for buffalo | Sakshi
Sakshi News home page

గేదెకు పుట్టినరోజు వేడుక

Apr 1 2015 7:40 PM | Updated on Sep 2 2017 11:42 PM

గేదెకు పుట్టినరోజు వేడుక

గేదెకు పుట్టినరోజు వేడుక

నల్లగా నిగనిగలాడుతున్న దేహం, మెడలో పూలదండ, అందంగా వంపులు తిరిగిన కొమ్ములతో ఉన్న బర్త్ డే బేబీ 'గేదె' బుధవారం ఇష్టంగా కేక్ తింది. అవును.. ఈ రోజు ఆ గేదె పుట్టినరోజు మరి!

మామిడికుదురు : నల్లగా నిగనిగలాడుతున్న దేహం, మెడలో పూలదండ, అందంగా వంపులు తిరిగిన కొమ్ములతో ఉన్న ఆ బర్త్ డే బేబీ 'గేదె'  బుధవారం ఇష్టంగా కేక్ తింది. అవును.. ఈ రోజు ఆ గేదె పుట్టినరోజు మరి!

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడికి చెందిన సూరిబోయిన వీరభద్రానికి, ఆయన పెద్దమ్మ పార్వతి ఓ గేదెను కానుకగా ఇచ్చారు. అదంటే ఎంతో ఇష్టం కలిగిన పార్వతి ఏటా దాని పుట్టిన రోజు వేడుక చేసేవారు. వీరభద్రం కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తూ బుధవారం బంధువులు, పిల్లలు, ఇరుగుపొరుగు వారి సమక్షంలో గేదె 12వ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరిపారు. కేక్, స్వీట్లు, అరటిపండ్లు పంచారు. ఆ గేదె తమ ఇంటికి వచ్చిన నాటి నుంచి అంతా మంచే జరుగుతోందని వీరభద్రం తల్లి సత్యవతి పేర్కొన్నారు. ఇలా గేదెకు పుట్టినరోజు వేడుక జరపడం చుట్టుపక్కల వారంతా విశేషంగా చెప్పుకొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement