లాక్‌డౌన్‌తో పాములకు నివాసంగా దుకాణాలు | Big Python Caught in Papavinasanam Shop On Thursday | Sakshi
Sakshi News home page

పాపవినాశనంలో కొండచిలువ హల్‌చల్‌

May 21 2020 3:54 PM | Updated on May 21 2020 4:08 PM

Big Python Caught in Papavinasanam Shop On Thursday  - Sakshi

సాక్షి, చిత్తూరు: లా​క్‌డౌన్‌ కారణంగా జనాలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో వన్యప్రాణులు యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే చాలా కాలం తరువాత కేంద్రప్రభుత్వం కొన్ని సవరణలు ఇ‍వ్వడంతో మళ్లీ మూతబడ్డ షాపులు తెరుచుకుంటున్నాయి. తిరుమల పాపవినాశనంలోని ఒక దుకాణాన్ని 60 రోజులు తరువాత తెరిచారు. షాపు తెరిచిన వెంటనే ఒక కొండచిలువ కనిపించడంతో షాప్‌ యజమాని షాక్‌కు గురయ్యారు. దుకాణ యజమాని షాపుకు ఉన్న పట్టను తొలగించగా భారీ కొండ చిలువ దర్శనమిచ్చింది. లాక్‌డౌన్‌ కారణంగా 60 రోజులుగా మూతబడిన అంగళ్లను పరిశీలించడానికి యజమానులు గురువారం షాపుల వద్దకు వెళ్లారు. రెండు నెలలకు పైగా జనసంచారం లేకపోవడంతో దుకాణాల్లోనే పాములు సేద తీరుతున్నాయి. దీంతో యజమానులు భయభ్రాంతులకు గురవుతున్నారు.  (వైఎస్ జయంతి రోజున ఇళ్ల పట్టాల పంపిణీ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement