అందనంత ఎత్తమ్మ ఈ ‘గొబ్బెమ్మ’

Big Gobbemma at Gummileru in East Godavari District - Sakshi

సాక్షి, ఆలమూరు: సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటి ముందు రంగవల్లులు, హరిదాసులు, డూ డూ బసవన్నల కోలాహలంతోపాటు గొబ్బెమ్మలు కూడా దర్శనమిస్తాయి. ఈ సంస్కృతీ సంప్రదాయాలను నేటి తరానికీ పరిచయం చేయాలనే సంకల్పంతో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం గుమ్మిలేరుకు చెందిన మహిళలు అత్యంత పొడవైన గొబ్బెమ్మను తయారు చేశారు. శ్రీ ఉరదాలమ్మ, దండుగంగమ్మ ఆలయం ఆవరణలో 10.10 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో గొబ్బెమ్మను తీర్చిదిద్దారు.

గుమ్మిలేరుకు చెందిన హరే శ్రీనివాస భక్త భజన బృందం, గ్రామ మహిళా సమాఖ్యకు చెందిన 20 మంది మహిళలు ఐదు టన్నుల ఆవుపేడను సేకరించి.. దాదాపు వారం పాటు శ్రమించి ఈ గొబ్బెమ్మను తయారుచేశారు. దీనిని పూలు, రంగులతో శోభాయమానంగా అలంకరించారు. భారత్‌ టాలెంట్స్‌ ఆఫ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ మోహిత్‌కృష్ణ ఇది అత్యంత పొడవైన గొబ్బెమ్మగా ధ్రువీకరణ పత్రం అందజేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top