
చైనా కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌కు కూడా సాధ్యం కాని మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను నేడు వైఎస్ జగన్....
సాక్షి, విజయనగరం : ప్రపంచంలో ఏ రాజకీయ నేతకు కూడా సాధ్యం కాని మహా పాదయాత్రను వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. చైనా కమ్యూనిస్టు అధినేత మావో జెడాంగ్‌కు కూడా సాధ్యం కాని మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను నేడు వైఎస్ జగన్ పూర్తి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 269వ రోజు పాదయాత్ర విజయనగరం జిల్లాలోకి విజయవంతంగా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజల సంక్షేమ, యోగక్షేమాలు తెలుసుకునేందుకే ఆయన ఈ యాత్రను చేపట్టారని తెలిపారు. ఆయనకు దారిపొడవున ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని అన్నారు.