ధీమానివ్వని బీమా

Bhima Not Helped To Farmers - Sakshi

అక్కరకు రాని బీమాతో  రైతాంగం అవస్థలు

బీమా చెల్లించినా...పరిహారంలో అనేక వింతలు

కొందరికే పరిహారం...మరికొందరికి రిక్తహస్తం

లబోదిబో మంటున్న రైతులు...

పట్టించుకోని అధికారులు 

విజయనగరం గంటస్తంభం: రైతుల కోసం ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం అమలు చేస్తున్న విషయం విదితమే. రైతులు 10శాతం ప్రీమియం చెల్లిస్తే మిగతా సొమ్ము కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 2015–16 ఆర్థిక సంవత్సరం నుంచి ఏటా బీమా ప్రీమియం డీఆర్‌డీఏ అధికారులు కట్టిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 27వేల మంది ప్రీమి యం చెల్లించారు. గడిచిన మూడేళ్లలో 25వేల నుంచి 30వేల మంది వరకు ఐసీఐసీఐ ఇన్సూరెన్స్‌ కంపెనీకి ప్రీమియం కట్టినట్టు సమాచా రం. ప్రీమియం చెల్లించిన రైతులు పంట నష్టపోతే ఆ కంపెనీ రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. ఇందులో భాగంగా 2015–16 సంవత్సరానికి సం బంధించి 25వేల మంది వరకు రైతులు బీమా కట్ట గా పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వి డుదల చేస్తున్నారు. ఇందులో అనేక వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రీమియం చెల్లించిన రైతులందరికీ పరిహారం రావడం లేదు. మంజూరైన జాబితాలో కూడా చాలామంది రైతుల పేర్లు లేవు. వాస్తవానికి పంటల బీమా గ్రామం యూనిట్‌గా కట్టిస్తారు. కానీ ఒకే గ్రామంలో కొందరికి పరిహారం రావడం, మరికొందరికి రాకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇక ప్రీమియం చెల్లించిన రైతులకు  పరిహారం వచ్చినట్లు అధికారులకు సమాచారం వచ్చింది. ఆ జాబితాలో పేర్లున్నా... బ్యాంకు ఖాతాలో కొందరికి జమ కావట్లేదు.

 పట్టించుకోని అధికారులు
బీమా ప్రీమియం కట్టినా పరిహారం రాకపోవడం, పరిహారం వచ్చినా బ్యాంకు ఖాతాలో సొమ్ము లేకపోవడంతో రైతులు, రైతు సంఘాల నాయకులు డీఆర్‌డీఏ, వ్యవసాయాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రీమియం చెల్లించినా అసలు  నష్టపరిహారం రాకపోతే డీఆర్‌డీఏ, వ్యవసాయాధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. పరిహారం సొమ్ము పడకపోతే బీమా కంపెనీ కూడా స్పందించాలి. కానీ ఎవరూ ట్టించుకోకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.

వివరాలు చెబితే పరిష్కరిస్తాం
ఐసీఐసీఐ కంపెనీకి 2015–16 సంవత్సరం బీమాతో సంబంధం లేదు. తర్వాత నుంచి పంటల బీమా మా కంపెనీ కట్టించుకుం టోంది. కాబట్టి ఆ ఏడాది నుంచి ఎవరికైనా సమస్య ఉంటే వివరాలు తెలియజేస్తే పరిష్కరిస్తాం. సోమవారం సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తాం. ప్రీమియం కట్టినా పరి హారం రాకపోయినా, పరిహారం మంజూరై జమ కాకపోయినా రైతుల వివరాలు తెలియజేస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం.
– మల్లికార్జున, ఐసీఐసీఐ లాంబోర్డు బీమా అధికారి

ప్రీమియం కట్టినా రాలేదు
నాకు పినవేమలి రెవెన్యూలో మూడు ఎకరాల భూమి ఉంది. బీమా కోసం రూ.1540 చెల్లిం చాను. పంట నష్టపోవడంతో బీమా పరిహారానికి ఆ గ్రామం ఎంపికైంది. కొందరు రైతులకు పరిహారం వచ్చింది. కానీ నాకు మాత్రం రాలేదు. ఇదేమని అడిగితే ప్రీమియం మీపేరున కట్టలేదని డీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. కావాలంటే ప్రీమియం సొమ్ము వెనక్కి ఇచ్చేస్తామని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఇదేమి ఘోరం.              
 – సిరిపురం క్రిష్ణంనాయుడు,రైతు కోరుకొండపాలెం      

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top