'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' | Because of YS Rajasekhar Reddy, Ponnam Prabhakar became MP | Sakshi
Sakshi News home page

'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే'

Mar 31 2014 7:37 PM | Updated on Aug 15 2018 9:17 PM

'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే' - Sakshi

'పొన్నం ఎంపీ కావడం వైఎస్ భిక్షే'

టీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని కాకా, ఎమ్మెస్సార్‌ అన్నారు.

హైదరాబాద్: సంచలన, వివాదస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్ సత్యనారాయణ రావు (ఎమ్మెస్సార్), జి. వెంకటస్వామి (కాకా) చాలా కాలం తర్వాత నోరు విప్పారు. 'కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదు' అని ఎమ్మెస్సార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణం సోనియానే అని ఎమ్మెస్సార్‌ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వల్లే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ ఎంపీ అయ్యారని ఆయన అన్నారు. 
 
టీఆర్‌ఎస్‌ మునిగిపోయే నావ అని కాకా, ఎమ్మెస్సార్‌ అన్నారు.  కాంగ్రెస్‌లో విలీనం, పొత్తులు లేకపోవడానికి కేసీఆర్‌కు సీఎం పదవిపై ఆశ పెరిగిందని కాకా, ఎమ్మెస్సార్‌ లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది కాబట్టే వివేక్‌, వినోద్‌ కాంగ్రెస్‌లోకి వచ్చారని ఓ ప్రశ్నకు కాకా సమాధానమిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement