అద్దంలో అందగత్తె | Beautiful in the mirror | Sakshi
Sakshi News home page

అద్దంలో అందగత్తె

Jun 22 2014 11:59 PM | Updated on Sep 2 2017 9:13 AM

అద్దంలో అందగత్తె

అద్దంలో అందగత్తె

కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు మిస్సవుతున్న నటి సంజన కొత్తగా బిజెనెస్ రంగంలోకి కాలుపెట్టింది. హెయిర్ స్టైల్స్, మేకప్, సౌందర్య సేవలందించే సెలూన్ వ్యాపారంలో అడుగిడింది.

కొన్ని రోజులుగా తెలుగు ప్రేక్షకులు మిస్సవుతున్న నటి సంజన కొత్తగా బిజెనెస్ రంగంలోకి కాలుపెట్టింది. హెయిర్ స్టైల్స్, మేకప్, సౌందర్య సేవలందించే సెలూన్ వ్యాపారంలో అడుగిడింది. ప్రముఖ సెలూన్ సంస్థ మిర్రర్‌లో భాగస్వామ్యం తీసుకుని వ్యాపార విస్తరణలో మునిగిపోతోంది. మిర్రర్ బ్యూటీ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షోలో ఈ ముద్దుగుమ్మ మెరిపించింది. ఈ సందర్భంగా కాసేపు ‘సిటీప్లస్’తో ముచ్చటించింది.

 ‘తెలుగు అంటే చాలా ఇష్టం. ఇక్కడి పరిశ్రమ ఎంతో ప్రోత్సహించింది. టాలీవుడ్ అంతగా అచ్చిరాలేదు. కన్నడ, మళయాళంలో హిట్‌లున్నాయి. త్వరలో తెలుగులో ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో సరదా సినిమాలో నటించబోతున్నా. ఎప్పటికీ తెలుగు పరిశ్రమను వదలిపెట్టను. మంచి కథ దొరికితే తప్పకుండా నటిస్తా. బ్యూటీ అనేది క్రియేటివిటీకి అవకాశం ఉన్న రంగం. నాకు చాలా ఆసక్తి. హాలీవుడ్ మేకప్ ఆర్టిస్టు రాబిన్ స్లేటర్ వద్ద బ్యూటీ టిప్స్ నేర్చుకున్నా. ఆ స్థాయి నిపుణులు మనకు అవసరం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement