'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!' | battula brahmananda reddy slams on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'తెలుగోడి గౌరవం.. ఢిల్లీ వీధుల్లో తాకట్టు!'

Mar 4 2015 6:55 PM | Updated on Oct 20 2018 5:26 PM

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగు ప్రజల గౌరవాన్ని ఢిల్లీ నడివీధిలో తాకట్టు పెట్టారని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి10 నెలలు అయిందని, ఇప్పటివరకు ఆయన ఏ వాగ్దానాన్నైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం ఉండి కూడా ఏ రోజూ కేంద్రంతో పోరాడలేదన్నారు.

కేంద్రాన్ని నిలదీయలేనివారు ఆ ప్రభుత్వంతో ఎందుకు కొనసాగుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఏనాడైనా వారిని హెచ్చరించారా అని మండిపడ్డారు. ఏపీ కి అన్యాయం జరుగుతుంటే అధికారాన్ని అనుభవించాలన్న స్వార్థంతోనే టీడీపీ అధినాయకులు కేంద్రంతో లాలూచీ పడ్డారని ఆయన విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement