మస్తాన్ మృతదేహం తరలింపులో ఆటంకాలు | Barriers to move the body Mastan | Sakshi
Sakshi News home page

మస్తాన్ మృతదేహం తరలింపులో ఆటంకాలు

Apr 13 2015 3:30 AM | Updated on Sep 3 2017 12:13 AM

నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది.

మంచు తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న హెర్నన్ బృందం
సంగం: నెల్లూరు జిల్లాకు చెందిన పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు మృతదేహం తరలింపులో హెర్నన్ బృందానికి మంచు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆదివారం సాయంత్రం 4 గంటలకు లాస్‌గ్రాట్స్ అనే ప్రాంతానికి మృతదేహాన్ని చేర్చాల్సి ఉంది. అయితే మంచు కారణంగా రోడ్డు కూడా కనపడని పరిస్థితి నెలకొనడంతో హెర్నన్ బృందం ముందుకు సాగేందుకు అవాంతరం ఏర్పడుతోంది. దీంతో ప్రస్తుతానికి బృందం గుహల వద్దకు వెనక్కు వెళ్లింది.

Advertisement
 
Advertisement
Advertisement