రోడ్డు ప్రమాదంలో బెంగళూరు వాసి మృతి | Bangalore person killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బెంగళూరు వాసి మృతి

Dec 26 2015 1:39 PM | Updated on Aug 30 2018 3:56 PM

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బెంగళూరు వాసి మృతి చెందారు.

మంత్రాలంయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన బెంగళూరు వాసుల వాహనం ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన శాంతమ్మ(55) కుటుంబం ఈ రోజు ఉదయం మారుతి కార్‌లో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని వెళ్తుండగా.. కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న శాంతమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement