తెల్లపులి పిల్లలకు నామకరణం చేసిన మంత్రి

Balineni Srinivasa Reddy Attends Naming Ceremony Of White Baby Tigers Tirupati - Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీవెంకటేశ్వర జూ పార్కులో ఐదు తెల్లపులి పిల్లలు జన్మించాయి. జూ పార్కుకు చెందిన తెల్ల పులులు సమీర్‌, రాణిలకు పుట్టిన సంతానానికి రాష్ట్ర అటవీశాఖా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామకరణం చేశారు. మూడు మగ పులి పిల్లలకు వాసు, సిద్ధాన్‌, జగన్‌ అని... ఆడ పులి పిల్లలకు విజయ, దుర్గ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసరెడ్డితో పాటు ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎన్‌. ప్రదీప్‌ కుమార్‌ సహా ఇతర ఉన్నతాధికారులు నళినీ మోహన్‌, ఏకే ఝా, ఆర్కే సుమన్‌, శరవణన్‌, జూ క్యూరేటర్‌ బబిత తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top