21న బాలకృష్ణ కుమార్తె వివాహం | Balakrishna's daughter Tejaswini marriage on 21 August | Sakshi
Sakshi News home page

21న బాలకృష్ణ కుమార్తె వివాహం

Aug 12 2013 1:36 AM | Updated on Aug 29 2018 1:59 PM

సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21వ తేదీన ఉదయం 8.52కు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మతుకుమిల్లి శ్రీభరత్‌తో జరగనుంది. ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది.

సాక్షి, హైదరాబాద్: సినీనటుడు నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21వ తేదీన ఉదయం 8.52కు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో మతుకుమిల్లి శ్రీభరత్‌తో జరగనుంది. ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది. శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న హరికృష్ణ హాజరు కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement