ఘనంగా బాలసాయిబాబా 59వ జయంతి ఉత్సవాలు

Bala SaiBaba Birth Anniversary Celebrations At Sri Nilayam - Sakshi

సాక్షి, కర్నూలు: భగవాన్ శ్రీ బాలసాయిబాబా 59వ జయంతి ఉత్సవాలు కర్నూలులో ఘనంగా జరుగుతున్నాయి. నగరంలోని శ్రీ నిలయంలో జరుగుతున్న ఈ వేడుకల్లో దేశ, విదేశాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో నేషనల్ కమిషన్ ఫర్ సాయి కరమ్‌చారీస్‌కు చెందిన మనోహర్, తమిళనాడు రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప, జాతీయ బాలల హక్కుల సంఘం సలహాదారు రామస్వామి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ తదితరులు పాల్గొన్నారు. జయంతి ఉత్సవాల సందర్భంగా మెగా మెడికల్ క్యాంపు, పేదలకు తోపుడు బండ్లు, మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top