గంటా శ్రీను కుమారుడికి బెయిల్ మంజూరు | bail granted to ganta srinivasa rao son | Sakshi
Sakshi News home page

గంటా శ్రీను కుమారుడికి బెయిల్ మంజూరు

Mar 18 2014 5:20 PM | Updated on Sep 2 2017 4:52 AM

గంటా శ్రీను కుమారుడికి బెయిల్ మంజూరు

గంటా శ్రీను కుమారుడికి బెయిల్ మంజూరు

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజకు బెయిల్ మంజూరైంది.

తెలుగుదేశం పార్టీ నేత,మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజకు బెయిల్ మంజూరైంది. రాజేంద్ర నగర్ కోర్టు ఈ బెయిల్ మంజూరు చేసింది. రవితేజ, అతని ఇంద్రజిత్ కలిసి మద్యం సేవించి సోమవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ అభ్యంతరకరంగా ప్రవర్తించడంతో పాటు పుష్ఫక్ బస్సు కండక్టర్‌పై దౌర్జన్యం చేయడంతో పోలీసులు ఇరువురినీ అరెస్టు చేశారు.

నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆర్‌జీఐఏ పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రమేష్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రవితేజ, ఇంద్రజిత్‌పై ఐపీసీ 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. నిందితులు ఇద్దరినీ అత్తాపూర్‌లోని మేజిస్ట్రేట్ ఇంట్లో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించారు. అయితే, మంగళవారం నాడు రవితేజకు కోర్టు బెయిల్ మంజూరుచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement