బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య | b tech student suicide | Sakshi
Sakshi News home page

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Sep 25 2013 1:11 AM | Updated on Nov 9 2018 5:02 PM

నిజామాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని మంగళవారం బాసర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..

 బాసర, న్యూస్‌లైన్ : నిజామాబాద్‌కు చెందిన బీటెక్ విద్యార్థిని మంగళవారం బాసర నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లీకి చెందిన మూడ సదానందంకు నలుగురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు శ్యామల(20) ఇటీవల బీటెక్ తృతీయ సంవత్సరం పరీక్షలు రాసింది. అందులో ఒక సబ్జెక్టు తప్పడంతో మనస్తాపం చెందింది. ఇక తనను చదివించలేరనే బాధతో బాసర గోదావరి నది బ్రిడ్జిపై నుంచి నదిలో దూకింది. చెప్పులు, పర్సు అక్కడే వదిలేసింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ప్రవీణ్‌కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. పర్సులో ఉన్న ఫొటోలు, డ్రెస్‌పై ఉన్న టేలర్ నంబరుకు పోలీసులు ఫోన్ చేయడంతో వివరాలు లభించాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement