అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం జగన్‌ సంకల్పం

Avanti And Mvv Says All Areas Are Equal Development With YS Jagan Decision - Sakshi

మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమాన అభివృద్ధి చేయాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేశారని రాష్ట్ర పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ లు అన్నారు. శుక్రవారం విశాఖలో  క్రెడాయ్ ప్రాపర్టీ షో ని ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్ చేసిన ప్రకటనతో ఉత్తరాంధ్ర వాసులతో పాటు రాష్ట్ర ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తో విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందని...మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ ఒక్కటే అభివృద్ధి చెందిందని...అందుకే రాష్ట్ర విభజనకు కారణమైందన్నారు. సీఎం నిర్ణయంతో అభివృద్ధి ఫలాలు అన్ని ప్రాంతాలకు సమాన స్థాయిలో అందుతాయన్నారు. మూడు రాజధానుల వల్ల ఎటువంటి సమస్యలు రావని...కావాలనే ప్రతిపక్షం ప్రతీ విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తోందని విమర్శించారు.

వలసలు ఆగిపోతాయి..
విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుతో రియల్ ఎస్టేట్ రంగంతో పాటు అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని విశాఖ క్రెడాయ్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మూడు రాజధానులు మంచి ఆలోచన అని...సీఎం వైఎస్ జగన్ ప్రకటనను తాము స్వాగతిస్తున్నామని క్రెడాయ్ ప్రతినిధులు అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వల్ల వెనుకుబాటుతనానికి గురైన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వలసలు ఆగిపోతాయని క్రెడాయ్ ప్రతినిధులు పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top